త్రిష పెళ్లికి సంబంధించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. గతంలో వరుణ్ మణియన్ నిశ్చితార్థం అయ్యి.. తర్వాత పలు కారణాలతో పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా త్రిష మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్రిష సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో గాసిప్పులు పుట్టిస్తున్న వారికి త్రిష బోల్డ్‌గా ఓ ట్వీట్ చేసింది. ‘మీరు మీతోపాటు ఉన్న మీ బృందం ఎవరో మీకు తెలుసు. ప్రశాంతంగా ఉండండి. ఇంతటితో ఈ గాసిప్పులకు ఫుల్స్టాప్ పెట్టండి.. చీర్స్! అంటూ తనదైన స్టైల్లో త్రిష పోస్ట్ చేసింది. త్రిష అంటే గిట్టని వారే ఇలా లేనిపోని వదంతులు పుట్టిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.