ప్రభాస్ ప్రస్తుతం యూరోప్ లో వున్నాడని, అతని మోకాలికి శస్త్రచికిత్స అయిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నాడని అంటున్నారు. అందుకనే అతను షూటింగ్ లు ఏమీ చెయ్యకుండా ముందు మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడని వార్త వైరల్ అయింది. ప్రభాస్ సినిమాలు ఒకటి 'సలార్' విడుదలకి సిద్ధంగా వుంది కానీ, ఎప్పుడు విడుదల అనేది ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఇంకో సినిమా 'కల్కి 2898 ఎడి' సినిమా కూడా షూటింగ్ జరగాలి, కానీ ప్రస్తుతం జరగటం లేదు అని అంటున్నారు. అలాగే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా 'రాజా డీలక్స్' షూటింగ్ కొంత అయింది, ఈ సినిమాని పీపుల్స్ మీడియా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కొనసాగాలి. అయితే ప్రస్తుతం అభిమానులు 'సలార్' విడుదల తేదీ, ఆ సినిమా గురించి ఏదైనా సమాచారం వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు.