ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కన్నప్ప' సినిమాలో భారీ తారాగణం

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 01, 2023, 01:17 PM

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న 'కన్నప్ప' సినిమా న్యూజిలాండ్ లో షూటింగ్ జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఇదొక హై బడ్జెట్ సినిమాగా, పాన్ ఇండియ సినిమాగా మంచు విష్ణు ఈ సినిమాని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. దీనికి 'మహాభారత్' సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్  దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మాలీవుడ్ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సైతం 'కన్నప్ప' సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్‌గా మోహన్ లాల్‌ను కలిశారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయి నాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa