'జితేందర్‌రెడ్డి’ టైటిల్‌తో ఓ పోస్టర్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే! విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించేది ఎవరా? అనే ఆసక్తిని క్రియేట్ చేశారు. ఆ పాత్రధారి ఎవరనేది సోమవారం రివీల్ చేశారు. జితేందర్ రెడ్డి పాత్ర పోషించేది బాహుబలి, ఎవరికీ చెప్పొద్దు చిత్రాల ఫేం రాకేష్ వర్రే. 'ఉయ్యాల జంపాల', 'మజ్ను' ప్రేమ కథల్ని తెరకెక్కించిన విరించి వర్మ తన రూట్ మార్చి పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నారు. 'ఎవరికీ చెప్పొద్దు' చిత్రంతో హీరోగా గుర్తింపు పొందిన రాకేష్ కొంత గ్యాప్ తర్వాత 'జితేందర్ రెడ్డి’ సినిమాను ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ కథలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు. మొదట ఈ పాత్రను అనేక మంది హీరోలు రిజెక్ట్ చేశారట. ఫైనల్‌గా రాకేష్ అయితే ఈ పాత్రకు న్యాయం జరుగుతుందని నమ్మిన దర్శకుడు ఆయన్నే ఫైనల్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉందీ సినిమా. ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.