‘‘టైగర్ నాగేశ్వరరావు పాత్రకు రవితేజ పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు. ఆ పాత్రలో ఆయన విజృంభించార’’ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కితాబిచ్చారు. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’కి యాక్షన్ కంపోజ్ చేసింది వీళ్లే. ఈనెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ ‘‘మేం కూడా స్టువర్టుపురంలోనే పుట్టాం. టైగర్ నాగేశ్వరరావు గురించి కథలు కథలుగా విన్నాం. అందుకే ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యాం. దర్శకుడు ఈ కథని చెప్పిన విధానం బాగుంది. కొన్ని ఎపిసోడ్లు ఊహకు అందనంత స్థాయిలో ఉంటాయి. యాక్షన్ ఘట్టాల్ని వాస్తవికతకు దగ్గరగా మలిచాం. ట్రైన్ ఎపిసోడ్ హైలెట్‌గా నిలుస్తుంది. చీరాలలోని జీడి తోటల్లో ఓ ఫైట్ తీశాం. అది అందరికీ నచ్చుతుంది. నిర్మాత అభిషేక్ అగర్వాల్గారు ఫైట్ సీక్వెన్స్ చూసి మెచ్చుకొన్నారు. ఆయన బ్యానర్ వాల్యూకి తగ్గట్టుగా ఈ సినిమాని దర్శకుడు తీర్చిదిద్దాడు. రవితేజగారి ఫిట్నెస్ వేరే స్థాయిలో ఉంటుంది. ఆయన ఎనర్జీకి మారు పేరు త్వరగా అలసిపోరు. అందుకే ఆయనతో సినిమా అంటే ఛాలెంజ్‌గా అనిపిస్తుంది. ఆయన కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంద’’న్నారు.