జైలర్’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు హీరో రజనీకాంత్. అదే జోరుతో తదుపరి చిత్రాలపై దృష్టిపెట్టారు. టి.జి జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రకటించిన సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్లను పంచుకుంటున్నారు. ‘తలైవా 170’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని చెబుతూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఇంతకు మనుపు ఈ పాత్ర కోసం నాని పేరు వినిపించింది. తర్వాత శర్వానంద్ పేరు కూడా తెరపైకి వచ్చింది. తాజాగా నిర్మాణ సంస్థ ట్వీట్‌తో ఈ రూమర్స్‌కు చెక్ పడింది. రానా రాకతో ‘తలైవా 170’ మరింత ఆసక్తికరంగా ఉండబోతోందని తాజా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. మంజూ వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ నాయికలుగా ఎంపికైనట్లు చిత్ర బృందం తెలిపింది. వీరితోపాటు ఇతర అగ్ర నటులు కూడా నటించనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, మలయాళం నుంచి ఫహాద్ పాజిల్ను కూడా తీసుకుంటున్నట్లు టాక్.