కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి దేవర అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. తాజాగా ఈరోజు ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ ఒక వీడియోను విడుదల చేసి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు తెలిపారు.
కొరటాల శివ మాట్లాడుతూ - కోస్తా తీరంలోని మరిచిపోయిన ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాన్వాస్ చాలా పెద్దది. షూటింగ్ స్టార్ట్ అయ్యే కొద్దీ సినిమా మరింత పెద్దదైంది. సినిమాలోని ప్రతి పాత్రను వివరంగా విశ్లేషిచాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ కథను రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాం అంటూ వెల్లడించారు.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.