టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'భగవంత్ కేసరి' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు. 'ఐ డోంట్ కేర్' అనే ట్యాగ్‌లైన్ ని ఈ సినిమాకి మేకర్స్ లాక్ చేసారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా అక్టోబర్ 19, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.