కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'లియో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అయితే, ఇటీవల ఎక్స్ స్పేస్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత లలిత్ కుమార్ ఈ చిత్రం మల్టీప్లెక్స్ విడుదల కాదని వెల్లడించారు. ప్రత్యేకంగా 2000 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శించబడుతుంది అని చెప్పారు. ఈ నిర్ణయం ఉత్తర భారత ప్రాంతంలో సినిమా కలెక్షన్లపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. నార్త్ ఇండియన్ అభిమానులు సినిమా నిర్మాతలు పునరాలోచించుకోవాలని మరియు మల్టీప్లెక్స్‌లను రిలీజ్ ప్లాన్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. లియో అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.