విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లియో’. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే! అయితే ఈ ట్రైలర్‌ను ప్రదర్శించిన థియేటర్లకు సెన్సార్ బోర్డు లీగల్ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. చెన్నైలోని కొన్ని థియేటర్‌లలోనూ ట్రైలర్‌ను ప్రదర్శించారు. అయితే, సెన్సార్ కట్ లేకుండా, అభ్యంతరకర పదాలతో కూడిన ట్రైలర్‌ను చూపించారంటూ సెన్సార్ బోర్డు సదరు థియేటర్లకు లీగల్ నోటీసులు పంపింది. నిబంధన ప్రకారం అలాంటి ట్రైలర్‌ను పబ్లిక్‌లో ప్రదర్శించకూడదని, దీనిపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ులియో’ ట్రైలర్‌కు మొదటిరోజు మిశ్రమ స్పందన వచ్చింది. చెన్నైల్లో కొందరు అభిమానులు అయితే ఆశించిన స్థాయిలో ట్రైలర్ లేదని అసహనంతో ఓ థియేటర్‌ను ధ్వంసం చేశారు. కానీ రెండో రోజుకి ఈ ట్రైలర్ య్యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ సాధించింది. ఈ మఽధ్యకాలంలో కోలీవుడ్‌లో విడుదలైన ట్రైలర్‌లో ఇదే రికార్డ్ సాధించినట్లు విమర్శకులు చెబుతున్నారు. అయితే ఇందులో వాడిన అభ్యంతరకర పదాల గురించి దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఆ సన్నివేశాల్లో అలాంటి పదాలు వాడకపోతే ఎమోషన్ పండదని అందుకే వాటిని ఉపయోగించినట్లు చెప్పారు. దానికి పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. యాక్షన డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విజయ్ సరసన త్రిష కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, గౌతమ్ మీనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.