మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మెకానిక్ అల్లుడు సినిమా షూటింగ్ సమయంలో నేను అమెరికా వెళ్లాను. నేను అమెరికా వెళ్లినా సినిమా షూటింగ్ జరిగింది. తిరిగి వచ్చాక అన్ని మ్యాగజైన్స్ చూశాను. నా సినిమా గురించి ఏమైనా రాశారా అని. కానీ ఎందులోనూ ఒక్క వార్త కూడా రాలేదు. జర్నలిస్టులు నన్ను బ్యాన్ చేశారని తెలిసి బాధపడ్డాను.’ అని చెప్పుకొచ్చారు.