టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'భగవంత్ కేసరి' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. USA అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం కాగా ఈ చిత్రం ఇప్పటికే 150K$ మార్క్‌ను దాటింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి U/A సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం.
ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా అక్టోబర్ 19, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.