తమిళ స్టార్ నటుడు రెహమాన్ తొలిసారిగా బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు. ‘గణపత్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌కు కుమారుడిగా ఆయన నటించారు. ఈ సినిమా ఈ నెల 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ ఇంజినీర్ కావాలనుకున్న తనకు ఓ మలయాళ దర్శకుడి వల్ల సినిమాల్లో అవకాశం వచ్చిందని, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించానన్నారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చిందన్నారు.