గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది.గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నటి లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. నటిగా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో తన గుర్తింపు పెంచుకుంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ. లహరి బిగ్ బాస్ 5లో ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. మూడవ వారంలోనే ఆమె ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. యాంకర్ రవి, లహరి, నటి ప్రియా ముగ్గురి వ్యవహారం హౌస్ లో రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే. యాంకర్ రవి, లహరి బాత్రూం వద్ద హగ్గులు చేసుకున్నారు అంటూ నటి ప్రియా హౌస్ లో సంచలన ఆరోపణ చేసింది. దీనితో రవి, లహరి ఆమెపై ఒకరేంజ్ లో ఫైర్ అయ్యారు. అలా లహరి హౌస్ లో ఉన్నన్ని రోజులు వివాదాల్లో కనిపించింది. మూడవ వారంలో ఎలిమినేట్ అయింది. గ్లామర్ పరంగా కూడా లహరి సిరి నెటిజన్లని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంది. తాజాగా లహరి సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, తెల్ల చీరలో తన సొగసు చూపిస్తూ ఊరించే ఫోజులు ఇచ్చింది.