దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి బుధవారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అక్కడ మీడియా వారు ఆమెను పలు ప్రశ్నలు అడిగారు. ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ‘త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయి ఎవరు? పెళ్లి తేది ఇంకా తెలియదు గానీ ఆ రోజు త్వరలోనే వస్తుంది. తప్పకుండా వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడవుతాడు’ అని శ్యామలాదేవి సమాధానమిచ్చారు.