కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ తన 62వ ప్రాజెక్ట్ ని యువ తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేనితో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విదా ముయార్చి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అజర్బైజాన్లో జరుగుతోంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం యువ నటి ప్రియా భవానీ శంకర్‌ని మూవీ మేకర్స్ ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బిగ్గీలో హిందీ నటుడు సంజయ్ దత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ హిట్ మెషిన్ అనిరుధ్ రవిచందర్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్కు సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.