బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఈ మధ్యన జరిగిన భారత - పాక్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలానే సమీప పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశారు. అలానే ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఇనస్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌కు ఫలితం కనిపించింది. ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది. ‘మీ ఫోన్ నా దగ్గరే ఉంది. అది మీకు దక్కాలంటే క్యాన్సర్‌తో బాధపడుతున్న నా సోదరుడిని కాపాడుకోవడం కోసం సాయం చేయండి’ అని సదరు వ్యక్తి కండీషన్ పెట్టాడు. అందుకు ఊర్వశి రౌతేలా సరే అన్నట్లు థంబ్స్ పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.