విజయ్ హీరోగా తెరకెక్కిన ‘లియో’ చిత్రం నిన్న అనగా గురువారం భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో నడుస్తోంది. అలానే వసూళ్ల పరంగా ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం మొదటిరోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే అత్యధిక వసూళ్లు చేసి మంచి బిజినెస్ చేసింది. లెక్కల ప్రకారం వరల్డ్‌వైడ్‌గా తొలిరోజు రూ.140కోట్లకు పైగా రాబట్టిందని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన కోలీవుడ్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. దీంతో విజయ్ ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. అభిమాన హీరో సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లోకేశ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రారంభం నుంచి ఎన్నో వివాదాల మధ్య నలిగింది. విడుదలకు ముందుకు కూడా ఈ చిత్రానికి పలు సమస్యలు ఎదురయ్యాయి. ట్రైలర్ విడుదల తర్వాత అందులో అభ్యంతరకర డైలాగ్‌లు ఉన్నాయంటూ గొడవ చెలరేగింది తమిళనాడు ప్రభుత్వం. వీటన్నింటి మధ్య కూడా సినిమా సక్సెస్ అయ్యి రికార్డులు సృష్టించడంతో చిత్రబృందమంతా ఆనందం వ్యక్తం చేస్తోంది.