ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనసూయ పోస్ట్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 20, 2023, 02:53 PM

యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అనసూయ (Anasuya) ఒకరు. ప్రస్తుతం ఈమె వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అనసూయ కూడా ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ గా సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇలా యాంకర్ గా పనిచేసిన ఈమెకు రాని గుర్తింపు జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించడంతో భారీ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇలా ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనంతరం ఈమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.


ఇలా రంగస్థలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అప్పటివరకు అనసూయ పలు సినిమాలలో నటించిన పెద్దగా రాని గుర్తింపు రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత అనసూయ కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూడలేదు. వరుస సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు కూడా గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ వెండితెరపై ఎంత బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.


 


  ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలతో ఈ మధ్యకాలంలో అనసూయ చాలా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నటువంటి ఒక పోస్ట్ వైరల్ గా మారింది ఇందులో భాగంగా అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా అన్ని పనులు నేర్పించాలన్న ఉద్దేశంతోనే ఈమె ఈ పోస్ట్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుత కాలంలో ఎంతోమంది అబ్బాయిలు అంటే వారికి ఏదో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని వారికి ఎలాంటి పనులు చెప్పకూడదు అన్న ధోరణిలో అందరూ ఉంటున్నారు కానీ అనసూయ మాత్రం అందరూ సమానం అనే ఉద్దేశంతోనే ఈమె ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది.  ఇందులో భాగంగా మీ ఇంట్లో అబ్బాయిలకు మీరు వంట చేయడం నేర్పించండి అలాగే ఇంటిని శుభ్రం చేయడం అదేవిధంగా జీవితం పట్ల కొన్ని బేసిక్ స్కిల్స్  అన్నింటిని నేర్పించండి కానీ జెండర్ రోల్స్  పాటించమని చెప్పకండి అంటూ ఈమె సోషల్ మీడియా వేదిక షేర్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుత కాలంలో వంట పని ఇంట పని కేవలం అమ్మాయిలు మాత్రమే చేయాలి అన్నది ఇప్పటికీ ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది అమ్మాయిలు కేవలం వంటింటికి మాత్రమే బానిసలుగా మారుతున్నారు కానీ వంట పని ఇంటిని మైంటైన్ చేసే విషయాలన్నింటినీ కూడా అబ్బాయిలకు నేర్పించాలని అనసూయ వెల్లడించారు.  ఇక అనసూయకు ఇద్దరు కుమారులు అనే విషయం మనకు తెలిసిందే. తన పిల్లలకు అన్ని విషయాల గురించి బాగా అర్థమయ్యేలాగా వివరిస్తానని, వారికి ఇంటి పనులతో పాటు ఇంటి బాధ్యతలను కూడా నేర్పిస్తాను అంటూ గతంలో అనసూయ తెలియచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క అబ్బాయికి కూడా ఈ జీవితం పట్ల కాస్త అవగాహన నేర్పించాలి అంటూ తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అనసూయ కెరియర్ విషయానికి వస్తే కెరియర్పరంగా అనసూయ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com