ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్లో కలర్ టైట్ డ్రెస్ లో నేహా శెట్టి

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 22, 2023, 12:25 PM

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో నేహా శెట్టి ఒకరు.ఈ నటి కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి ఏవి ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టలేదు. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ నటి డీజే టిల్లు అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రాధిక పాత్రలో నటించిన ఈ చిన్నది తన నటనతో మాత్రమే కాకుండా అంతకుమించిన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.


ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈ నటి క్రేజ్ తెలుగులో అమాంతం పెరిగిపోయింది. దానితో వరుసగా నేహా శెట్టి కి తెలుగులో సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం బెదురులంక 2012 ... రూల్స్ రంజన్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో బెదురులంక 2012 మూవీబాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోగా ... రూల్స్ రంజాన్మూవీబాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఇకపోతే సినిమాల్లో తన అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డు చెప్పకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నేహా కి సంబదించిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com