‘పుష్ప ది రైజ్’ చిత్రానికిగానూ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం దక్కింది. ఈ అవార్డు అందుకోవడంపై అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. తన మిత్రుడైన దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా అనిపించిందన్నారు. అల్లు అర్జున మాట్లాడుతూ... ఈ చిత్రంతో నా నటనకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సుకుమార్ ఎంతో శ్రమించారు. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. బాలీవుడ్‌కు వెళ్లమని దేవిశ్రీ ప్రసాద్‌కి ఎన్నోసార్లు చెప్పా. నేను ఆ మాట చెప్పిన ప్రతిసారీ.. ‘ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు నేనూ వచ్చేస్తా’ అనేవాడు. ఇది సాధ్యమా అనేకునేవాడిని. కానీ మేమిద్దరం ఒకేసారి ‘పుష్ప’తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం. అక్కడా మంచి విజయాన్ని అందుకున్నాం. 20 ఏళ్ల నుంచి దేవితో అంటున్న మాట ఇలా నిజమైనందుకు నాకు సంతోషంగా అనిపించింది అని అన్నారు.