కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి ఇంట్లో పెను విషాదం నెలకొంది. హరి తండ్రి వీఏ గోపాలకృష్ణన్ ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ఇప్పుడు 88 ఏళ్లు. తండ్రి మరణంతో హరి ఇంట విషాదం నెలకొంది. అంత్యక్రియల నిమిత్తం గోపాలకృష్ణ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం జిల్లాలోని కాచనవెల్లికి తరలించారు. వీఏ గోపాలకృష్ణన్‌కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమిళ స్టార్ హీరో సూర్యతో తీసిన 'సింగం' సినిమా సిరీస్ తో హరి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.