జవాన్, గెహరియాన్ వంటి సినిమాలలో అంగాంగ ప్రదర్శన, ముద్దు సీన్లతో నిత్యం వార్తల్లో ఉంటూ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకునే తన భర్త సమక్షంలోనే నోరు జారింది. దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న టీవీ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 8 త్వరలో టెలికాస్ట్ కానుంది. ఈక్రమంలో ఫస్ట్ ఎపిసోడ్‌కు బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకునే గెస్టులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల చేయగా.. నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ ప్రోమోలో ఓ సందర్భంలో కరణ్ జోహర్ మీకు రణవీర్‌తో కాకుండా ఇండస్ట్రీలో ఎవరితో మంచి కెమిస్ట్రీ ఉందని బావిస్తున్నారని దీపికాను అడగగా.. హృతిక్‌తో మంచి బాండింగ్ ఉంటుందని అనుకుంటున్నానని, అతనితో స్క్రీన్‌పై మంచి కెమిస్ట్రీ వర్కౌటవుతుందని చెప్పడంతో రణవీర్ ఖంగు తిన్నాడు. అయితే షారుఖ్‌తో ఐదారు సినిమాలు, రణవీర్‌తో నాలుగు సినిమాలు చేసిన దీపిక వారిద్దరిని కాదని హృతిక్ పేరు చెప్పడంపై కారణం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.