వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్.రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'ఆదికేశవ'. తాజాగా ఈ చిత్రంలోని 'లీలమ్మో' పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ.. "ఈ 'లీలమ్మో' నాకెంతో ఇష్టమైన పాట. దీన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది అసలైన మాస్ పాట. వినగానే నాకు నాగిని డ్యాన్స్ చేయాలనిపించింది. అంత బాగుంటుంది’’ అని ముద్దుగుమ్మ చెప్పింది.