మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి శుక్రవారం ఇటలీకి బయలుదేరారు. అక్కడ ఉన్న టస్కనీలో వీళ్ల పెళ్లి నవంబర్ 1 జరగనుంది. పెళ్లికి కేవలం ఈ ఇద్దరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. వరుణ్, లావణ్యతోపాటు పంజా వైష్ణవ్ తేజ్ కూడా ఇటలీ వెళ్లారు. అక్టోబర్ 30న మెహెందీ, హల్దీ వేడుకలు జరుగుతాయి. నవంబర్ 1న పెళ్లి తర్వాత హైదరాబాద్ తిరిగి రానున్నారు.