పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని టాలీవుడ్ నటి నిత్యామీనన్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘నేను మన సంస్కృతిని గౌరవిస్తాను. సంప్రదాయబద్ధంగా పెరిగిన అమ్మాయిని. నా పెళ్లిపై చాలా ప్రచారం జరిగింది. పెళ్లి అనేది స్త్రీ పురుషులిద్దరికీ ఆర్థికపరమైన భరోసా ఇవ్వాలనేది కొందరి అభిప్రాయం. నా వరకు అది అక్కర్లేదు. నాకు భరోసా ఇచ్చే అబ్బాయి దొరికితే చేసుకుంటా’ అని చెప్పింది.