హీరోయిన్ శ్రీదివ్య పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. త్వరలో పెళ్లి చేసుకుంటాను. ప్రియుడితోనే నా వివాహం అంటూ సంచలనానికి తెరలేపింది.చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తెలుగు అమ్మాయి శ్రీదివ్య. హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే చిత్రాల్లో ఆమె చైల్డ్ రోల్స్ చేశారు. దర్శకుడు రవిబాబు శ్రీదివ్యను హీరోయిన్ గా పరిచయం చేశాడు. మనసారా చిత్రంతో శ్రీదివ్య హీరోయిన్ అయ్యింది. మనసారా హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. అనంతరం దర్శకుడు మారుతి తెరకెక్కించిన యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ లో నటించింది. ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. దాంతో కోలీవుడ్ పై కన్నేసింది. వారుతపడతా వలిమార్ సంఘం టైటిల్ తో తెరకెక్కిన తమిళ చిత్రంలో శివ కార్తికేయన్ కి జంటగా నటించింది. ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకోగా తమిళంలో ఆమె ఫేమస్ అయ్యారు. అక్కడ వరుస చిత్రాలు చేసింది. తెలుగులో అడపాదడపా చేస్తూ వచ్చింది. కారణం తెలియదు కానీ... 2017 తర్వాత గ్యాప్ తీసుకుంది. సిల్వర్ స్క్రీన్ కి కొన్నేళ్లు దూరమైంది. 2022లో జనగణమన అనే మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళ చిత్రంలో రైడ్ లో నటిస్తుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. విక్రమ్ ప్రభు హీరోగా నటించిన రైడ్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రీదివ్యను ప్రేమ, పెళ్లి గురించి అడిగారు. ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. ప్రేమ పెళ్లి చేసుకుంటానని శ్రీదివ్య ఓపెన్ గా చెప్పడం చర్చకు దారి తీసింది. త్వరలో పెళ్లి చేసుకుంటాను. అది కూడా ప్రేమించిన ప్రియుడిని చేసుకుంటాను అని అన్నారు. దీంతో శ్రీదివ్య ప్రియుడు ఎవరు? ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటుందా? లేక ఆల్రెడీ ప్రియుడు ఉన్నాడా? అనే సందేహాలకు తెరలేపింది. శ్రీదివ్య అయితే స్పష్టమైన సమాధానం చెప్పలేదు.