టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారిద్దరి వివాహం అనంతరం మెగా హీరోలంతా కలిసి ఫోటోదిగారు. కొత్త జంటకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోను మెగాస్టార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం, ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.