నటుడు, దర్శకుడు కాదంబరి కిరణ్ పరిచయం లేని వ్యక్తి. సుమారు 250 సినిమాల్లో నటుడిగా చేసి, 'మనం సైతం' అనే సంస్థను స్థాపించి పేద వాళ్లకి, సహాయం కావాల్సిన వాళ్ళకి తనవంతు సహాయం చేస్తూ వస్తూ వున్నాడు. కాదంబరి కిరణ్ 'కుర్రాళ్ల రాజ్యం' అనే ఒక సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు. ఇప్పుడంటే చాలా టీవీ చానెల్స్ వచ్చాయి, డిజిటల్ చానెల్స్ వచ్చేసేయి, కానీ అప్పట్లో కేవలం కొన్ని చానెల్స్ మాత్రమే ఉండేవి. అటువంటి సమయంలో కాదంబరి కిరణ్ టీవిలో తనదైన మార్కు వేసాడు. చాలా సీరియల్స్ నిర్మించానని, ఏదైనా కొత్త ఛానల్ వస్తే అందులో తన సీరియల్ తప్పనిసరిగా ఉండేదని చెప్పాడు ఒక ఇంటర్వ్యూ లో చెపుతూ తనదైన రీతిలో తనకి ఎందుకు పేరు రాలేదు అనేదానికి తన పేట్ అని చెప్పాడు. అదే విధంగా నాగార్జున మీద సంచలన వ్యాఖ్యలు కూడా చేసాడు. "నాగార్జున ఇంటికి వెళ్లి రెండున్నర గంటలు కథ చెప్పాను నేను. అది ఒక మిరాకిల్ అని చెప్పాలి, ఎందుకంటే అయన ఇంటికి వెళ్లి ఆయన్ని రెండున్నర గంటలు కూర్చోపెట్టి కథ చెప్పాను. అతను కథ విని రెండు సన్నివేశాల్లో కరెక్షన్స్ చెప్పారు, నేను ఆ రెండు చేసి అతనికి చెప్పడానికి తిరుగుతూనే వున్నాను. ఇది 17వ సంవత్సరం అని చెప్పాడు కాదంబరి కిరణ్.