మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి వివాహ వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ల ఫొటో ఒకటి నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నాగబాబు ఈ ఫొటోను షేర్ చేస్తూ అన్నదమ్ముల బంధం గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మా మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా మా అన్నదమ్ముల బంధం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఈ ఫొటో ఓ జ్ఞాపకం మాత్రమే కాదు అంతకు మించింది. మా మధ్య ఉన్న అభిప్రాయాలు, విభేదాల కంటే లోతైన అనుబంధం చాలా ముఖ్యమైనది, బలమైనది. ప్రేమతో కూడిన ఎన్నో మధుర క్షణాలతో ఈ రిలేషన్ ముడిపడి ఉంది. ఇది ఎప్పటికీ విడదీయరానిది. దీనికి నేనెంతో విలువిస్తాను అంటూ నాగబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.