ప్రస్తుతం కోలీవుడ్‌ల మంచి రైజింగ్‌లో ఉన్న నటి ఎవరంటే త్రిష పేరే చెబుతారు. దాదాపు 25 ఏళ్లగా దక్షిణాదిన కథానాయికగా కొనసాగుతుంది. తాజాగా విజయ్‌తో 'లియో’ చిత్రంలో సందడి చేసింది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా.. మంచి వసూళ్లు రాబడుతోంది. తాజాగా చెన్నైలో జరిగిన లియో చిత్ర విజయోత్సవ వేడుకలో త్రిష మాట్లాడుతూ....లోకేశ్ కనకరాజ్ నన్ను కలిసినప్పుడు ఏం చెప్పారో అదే తెరపై ఆవిష్కరించారు. విజయ్ సరసన నటించడం మరిచిపోలేని అనుభవం. స్కూల్లో ఫ్రెండ్స్ కొన్నేళ్ల తర్వాత కలిేస్త ఎలా ఉంటుందో అలాంటి అనుభూతి నాకు కలిగింది. నా కెరీర్లో ఎక్కువ చిత్రాలు చేసింది విజయ్‌తోనే. విజయ్ నెమ్మదితనం, సింప్లిసిటీ ఆయన విజయానికి కారణం. నా స్నేహితులు విజయ్ మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తావని కలిసిన ప్రతిసారీ అడుగుతారు. లియోతో అది ఇన్నాళ్లకు జరిగింది. 15 ఏళ్ల తర్వాత కూడా మా కాంబినేషన్ సక్సెస్‌ఫుల్‌గా వర్కవుట్ అయింది అని అన్నారు.