అందాలను టైట్ డ్రెస్ లో బంధించి ఊపిరి ఆడకుండా చేసింది జాన్వీ కపూర్. ఒంటిని గట్టిగా హత్తుకున్న దుస్తుల్లో జాన్వీ కపూర్ ని చూసి మనసు పారేసుకుంటున్నారు కుర్రాళ్లు. గ్లామర్ ఐకాన్ గా అవతరించింది జాన్వీ కపూర్. ఈ బోల్డ్ బ్యూటీ తాజాగా టైట్ బాడీ కాన్ డ్రెస్ లో టెంపరేచర్ పెంచేసింది. జాన్వీ కపూర్ పరువాల జడివానలో జనాలు తడిసి ముద్దవుతున్నారు. శ్రీదేవి కూతురు అందాలు అదరహాలో అని కామెంట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. అయితే ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. అవకాశాలు వస్తున్నాయి కానీ భారీ విజయం దక్కడం లేదు. ఇటీవల బవాల్ టైటిల్ తో ఓ మూవీ చేసింది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు నితీష్ తివారి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా బవాల్ తెరకెక్కించాడు. . జాన్వీ కపూర్ ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ దేవర. ఈ మూవీతో సౌత్ లో జండా పాతాలని గట్టిగా ట్రై చేస్తుంది. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో దేవర తెరకెక్కుతుంది. దాదాపు రూ. 300 కోట్లు బడ్జెట్ కేటాయించారని సమాచారం. జాన్వీ-ఎన్టీఆర్ కాంబో చాలా ప్రత్యేకం. సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ షేక్ చేశారు. ఆరుడైన విజయాలు నమోదు చేశారు. వీరి వారసులైన ఎన్టీఆర్, జాన్వీ జతకట్టడం గొప్ప పరిణామం. దేవర మూవీకి హైప్ తెచ్చిన అంశాలలో ఇది కూడా ఒకటి.