మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఈ ఏడాది మార్చ్ నెలలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఆమె గుండెపోటుకు గురైనట్లు పేర్కొన్నారు వైద్యులు. దీంతో ఆమెకు యాంజియో ప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. అయితే ఏడాదికి రెండుసార్టు చెకప్ చేయించుకుంటున్నా ఇటీవల మరోసారి గుండెపోటుకు గురైనట్లు తెలిపారు. గుండె పని తీరును చెక్ చేేస ఎకోకార్డియోగ్రామ్ టెస్టులోనూ అంతా సరిగానే ఉందని రిపోర్టు వచ్చినప్పటికి ఇలా అయిందన్నారు. తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ "నా తల్లిదండ్రులకు గుండె సమస్య ఉంది. జన్యుపరంగా నాకు సైతం ఈ సమస్య ఎదురవుతుందనే అవగాహన ఉంది. అందుకే ఏడాదికి రెండుసార్లు గుండెకి సంబంధించి పరీక్షలు చేయించుకుంటున్నాను. రిపోర్ట్‌ల ప్రకారం అంతా బాగానే ఉన్న అకస్మాత్తుగా ఇలా జరగడం షాక్‌కు గురిచేసిందని సుస్మితా అన్నారు. తాజాగా ఆమె నటించి వెబ్ సిరీస్ ‘ఆర్య’ సీజన్ - 3 ఈ నెల 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో సుస్మిత గుండెపోటుకు గురయ్యారు. 'ఆర్య' ట్రైలర్‌లో చూపించిన ఓ యాక్షన్ సీన్‌ను తనకు గుండెపోటు వచ్చిన నెల తర్వాత చిత్రీకరించారని, ట్రైలర్‌లో బుల్లెట్ తగలడంతో కిందపడి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డానని చెప్పారు. అలాగే నిజజీవితంలోనూ గుండెపోటుతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.