మ్యాగజైన్ ఫోటో షూట్ లో బౌండరీలు బ్రేక్ చేసింది సమంత. గతంలో ఎన్నడూ కనిపించనంత హాట్ గా తయారైంది. బికినీని తలపిస్తున్న డ్రెస్ లో చెమటలు పట్టించింది. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ బజార్ సమంతపై ఫోటో షూట్ చేసింది. బ్లాక్ డిజైనర్ అవుట్ ఫిట్ లో సమంతను సూపర్ హాట్ గా ప్రజెంట్ చేశారు. బికినీని పోలిన డ్రెస్ లో హాట్ క్లీవేజ్ షోతో టెంపరేచర్ పెంచేసింది. సమంత హాట్ అవతార్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫ్యాన్స్ వెర్రెక్కి పోతున్నారు. ఈ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులపై స్పందన ఏంటని అడగ్గా... విడాకులు, ఆపై అనారోగ్యం నన్ను తీవ్రంగా కృంగదీశాయి. ఈ పరిణామాలు నా వర్క్ మీద ప్రతికూల ప్రభావం చూపాయి. సమస్య తర్వాత మరో సమస్య సతమతం చేశాయి. ఈ కఠిన పరిస్థితుల్లో నేను నాలాగే సమస్యలు బారిన పడ్డ నటుల జీవితాల గురించి చదివాను. వారు ఎలా పోరాటం చేసి గెలిచారో తెలుసుకున్నాను. అది నాకు ఎంతగానో ఉపయోగపడింది. అభిమానులు ప్రేమించే నటిగా ఉండటం ఒక బహుమతి. కాబట్టి మనం నిజాయితీగా ఉండాలి. మన నిజ జీవితాలు వారితో పంచుకోవాలి. కొంత కోలుకున్న తర్వాత ఖుషి చిత్ర పెండింగ్ షూటింగ్ తో పాటు సిటాడెల్ సిరీస్ పూర్తి చేసింది. ఈ ఏడాది సమంత ఖుషి, శాకుంతలం చిత్రాలు విడుదల చేసింది. సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సమంత కొత్త చిత్రాలకు సైన్ చేయలేదు. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#SamanthaRuthPrabhu pic.twitter.com/PmivGF8eGv
— VD bulletin (@vdbulletin) November 9, 2023