'పుష్ప' ఫేం రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు స్పందించి, నిందితులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించారు. ప్రస్తుతం సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిందని, అది వరమో శాపమో అర్థం కావట్లేదని అన్నారు.టెక్నాలజీ సహాయంతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టే బదులు, ఆ సమయాన్ని మంచి పనుల కోసం ఉపయోగించుకోండి అని ట్వీట్ ద్వారా తెలిపింది.