హీరో నాని లెటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వంలో తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో వస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నాని ఓ ఇంటర్వ్యూలో ‘ఇంతకుముందు కూడా నాన్న పాత్రలో నటించాను. కానీ ఈ సినిమా ఎందుకో నా హృదయానికి దగ్గరైంది. ఈ సినిమాలో నటిస్తున్నప్పటి నుంచి నాకూ ఓ కూతురు ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది' అని అన్నారు.