బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మంది సెలబ్రిటీలు అయిపోయారు. ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో లవ్ స్టోరీ లు కొనసాగడం ఒక ట్రెండ్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్-3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్.. సింగర్ గా తెలిసిన బిగ్ బాస్ లోకి వచ్చాకే ఫేమ్ వచ్చిందని చెప్పాలి. సీజన్-3 లో రాహుల్ సిప్లిగంజ్ తో పాటు పునర్నవి కూడా కంటెస్టెంట్ గా వెళ్లిన విషయం తెలిసిందే.సీజన్-3 లో రాహుల్-పునర్నవి ల లవ్ ట్రాక్ అందరికి తెలిసిందే. హౌస్ లో వీళ్లిద్దరి సాన్నిహిత్యం చూస్తే బయటకు వెళ్ళగానే పెళ్లికి బాజా మోగిస్తారని అనుకున్నారంతా. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు అన్ని పునర్నవి కోసం చేసేవాడు రాహుల్. ఆ తర్వాత పునర్నవి ఎలిమినేట్ అవడంతో రాహుల్ ఫీల్ అవుతున్న దానికి బిగ్ బాస్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు. దాంతో ఇద్దరు లవర్స్ అని హైప్ క్రియేట్ అయింది. అయితే అనుకోకుండా అదేమీ జరుగకుండా, ఎవరికి వారే అయిపోయారు. రాహుల్ ప్రైవేట్ అల్బమ్స్ అంటూ బిజీగా ఉంటున్నాడు. మరొకవైపు పునర్నవి విదేశాల్లో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. టీవీ షో ఈవెంట్స్ లో ఒక్కసారి కూడా పునర్నవి కన్పించలేదు. కానీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటు వస్తుంది.ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నాటు నాటు' పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ' నీ అయ్య నా మామ' అనే ఒక ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేసాడు. తనే సొంతంగా పాడాడు. కొన్ని రోజుల క్రితం ఈ పాటకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చెయ్యగ.. ఇప్పుడు పునర్నవి చేతుల మీదుగా పాటని లాంచ్ చేయించాడు రాహుల్. ఇన్ని రోజులుగా ఒక్కసారి కూడా కలవని వీళ్ళు సడన్ గా కలిసి పాటని లాంఛ్ చెయ్యడంతో ఇద్దరు ఎక్సైట్ అయ్యారు. ఇక వీళ్ళిద్దరు కలిసిన ఈ వీడియోని తమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఇక వీరి అభిమానులు.. చాలా రోజుల తర్వాత అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.