నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ ఏఐ రూపొందించిన నిందితులపై ఢిల్లీ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్లో సంబంధిత ఐపీసీ, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై ఢిల్లీ పోలీసులు త్వరలో విచారణ ప్రారంభించనున్నారు. రష్మిక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే ఢిల్లీ మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.