కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంత వరకు సినీ ప్రపంచంలో రానటువంటి ఓ ఆసక్తికర అంశంతో ఆమె ప్రయోగం చేయబోతున్నారు. ఆ ప్రయోగం ఏమిటంటే.. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. దర్శకుడు లోహిత్. హెచ్ ఎప్పుడూ కూడా కొత్త పాయింట్‌తోనే సినిమాలు తీస్తుంటారు. ప్రియాంక ఉపేంద్ర, లోహిత్ కాంబోలో ఇది వరకు ‘మమ్మీ, దేవకి’ వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరో ప్రయోగాత్మక చిత్రమైన ‘క్యాప్చర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని షమికా ఎంటర్ప్రైజెస్, శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రవి రాజ్ నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక ఉపేంద్ర పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.