సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా 'టైగర్ 3' సినిమా దీపావళి పండగ సందర్భంగా ఆదివారం విడుదలైంది. ఈ సినిమాకి కొంచెం మిశ్రమ టాక్ వచ్చినా, సల్మాన్ ఖాన్ తన సత్తా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపించాడు. ఈ సినిమా గూఢచారి నేపథ్యంలో వచ్చిన మూడో సీక్వెల్. ఆదిత్య చోప్రా నిర్మాత, మనీష్ శర్మ దర్శకుడు. ఇందులో షా రుఖ్ ఖాన్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తాడు. చివర్లో హ్రితిక్ రోషన్ కూడా కనిపిస్తాడు. ఈ సినిమా దీపావళి రోజున విడుదలై మొదటి రోజు ఆల్ టైమ్ చరిత్ర సృష్టించింది. అలాగే సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చి పెట్టింది. మొదటి రోజు హిందీ లో ఈ సినిమా రూ. 43 కోట్లు కలెక్టు చేసింది, అలాగే డబ్బింగ్ వెర్షన్ అంటే తెలుగు, తమిళం కలిపి రూ. 1.50 కోట్లు కలెక్టు చేసింది. మొత్తం ఈ సినిమా రూ. 44.50 కోట్లు వసూల్ చేసి చరిత్ర సృష్టించింది. మొదటి రోజున ‘టైగర్ 3’ సాధించిన రికార్డులు: హిందీ సినిమా చరిత్రలోనే దీపావళి పండగ రోజున అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలాగే సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రం కూడా ఈ 'టైగర్ 3' అవటం విశేషం. ఈ టైగర్ ఫ్రాంచైజీల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమా కూడా ఇదే అవటం ఆసక్తికరం. ఇంతకు ముందున్న దీపావళి రికార్డులను మూడురెట్లు అధికంగా వసూళ్లను సాధించిన 'టైగర్ 3'. ఇక రెండో రోజు కూడా సల్మాన్ ఖాన్ తన ప్రభంజనం చూపాడు. రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ వందకోట్లు సాధించింది. ఇలా రెండు రోజుల్లో వందకోట్లు సాధించిన ఘనత సాధించిన మూడో సినిమా ఈ 'టైగర్ 3'. ఇంతకు ముందు 'పఠాన్', 'జవాన్' ఇప్పుడు 'టైగర్ 3' ఈ ఘనత సాధించాయి. సోమవారం ఈ సినిమా రూ.58 కోట్లు కలెక్టు చేసింది. రెండు రోజులకి గాను హిందీలో కేవలం రూ.101 కోట్లు కలెక్టు చేసింది. ఇక తెలుగు, తమిళంలో ఈ సినిమా రెండో రోజు రూ.1.25 కోట్లు కలెక్టు చేసింది.