సూపర్ హీరో సినిమాలంటే మనోళ్లకు తెగ పిచ్చి. అయితే ఇండియన్ ఫ్యాన్స్ మన సూపర్ హీరో హను-మాన్‌ని తెరపై చూడటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది. తేజ సజ్జ లీడ్ రోల్ లో ప్రశాంత్ వర్మ రూపొందించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో 'హను-మాన్ ' సాహసాలను మరో రెండు నెలల్లో ప్రేక్షకులు చూసేయవచ్చు. యూనిక్ కాన్సెప్ట్‌లతో ఒరిజినల్ సినిమాలు తీయడమే కాకుండా ప్రమోషన్స్‌లోనూ తనదైన ప్రత్యేకతను చైపడంలో ప్రశాంత్ వర్మ స్పెషాలిటీ. గతంలో వచ్చిన టీజర్, హనుమాన్ చాలీసా పాటకు అద్భుతమైన స్పందన రావడంతో ఆయన, మూవీ టీమ్ సినిమాపై మరింత కేర్ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో తేజ సరసన అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి సినిమా హను-మాన్. ఈ సినిమా కాన్సెప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను జనవరి 12, 2024న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్ విడుదల కానుంది.