మొత్తానికి చాలా మంది సినీ అభిమానులు కొంతకాలంగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్, సైంటిఫిక్ మూవీ 'ఇండియానా జోన్స్ డయల్ ఆఫ్‌ది డెస్టినీ ' డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న ఈ సినిమా జూన్‌లో థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ టాక్‌తో యావరేజ్ చిత్రంగా నిలిచింది. అయితే థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాత ఓటీటీలోకి రావాల్సి ఉన్న ఈ చిత్రం కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి వస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో హరిసన్ ఫోర్డ్ హీరోగా మొదలైన ఈ ఇండియానా జోన్స్ సిరీస్‌లో మొదటగా ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ (1981) రాగా ఆ తర్వాత 1984లో ‘ఆండ్ ది టెంపుల్ ఆఫ్ ది డూమ్ , 1989లో ‘ది లాస్ట్ క్రూసెడ్’, చివరగా 2008లో ‘కింగ్‌డమ్ ఆప్‌ది క్రిష్టల్ స్కల్’ సినిమాలు విడుదలై ఒకదాన్ని మించి మరోటి సినీ అభిమానులను వీపరీతంగా ఆకట్టుకోగా వారిరువురికి ఎనలేని పేరును తీసుకువచ్చింది. ఈ క్రమంలో 1992లో ‘ది యంగ్ ఇండియానా జోన్స్ క్రానికల్స్‘ పేరిట వెబ్ సిరీస్ కూడా తెరకెక్కించారు.