అయితే పాక్ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల గురించి అబ్దుల్ రజాక్ ఎంతగా విమర్శించినా ఏం అయ్యేది కాదు కానీ.. ఐశ్వర్యరాయ్‌ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు విమర్శలకు కారణం అవుతున్నాయి. అబ్దుల్ రజాక్ మాటలకు భారత్ నెటిజన్లు.. ‘ఐశ్వర్యరాయ్ టాయిలెట్స్ కడగడానికి కూడా పనికిరావ్.. నోరు అదుపులో పెట్టుకో.. ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదా?’ అంటూ రజాక్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. అయితే రజాక్‌తో పాటు ఈ చర్చలో పాల్గొన్న ఇతర క్రికెటర్స్ అందరూ.. ఈ వ్యాఖ్యలను ఖండించడంతో.. అబ్దుల్ రజాక్ క్షమాపణలు కోరాడు. పాక్‌కు చెందిన సమా టీవీ వేదికగా.. ‘‘క్రికెట్ కోచింగ్, ఉద్దేశాలకు సంబంధించి నేనొక సమావేశంలో చేసిన కామెంట్స్‌కు క్షమాపణలు కోరుతున్నాను. ఐశ్వర్యరాయ్ విషయంలో టంగ్ స్లిప్ అయ్యాను. అందుకు ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మాత్రం ఆ వ్యాఖ్యలు చేయలేదని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను’’ అని అబ్దుల్ రజాక్ చెప్పుకొచ్చాడు. అయినా కూడా అతనిపై ఆగ్రహ జ్వాలలు మాత్రం ఆగడం లేదు.