దాంపత్య జీవితంపై బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని భర్త రణ్‌వీర్ గురించి మాట్లాడారు. ‘ఇద్దరం బిజీ జీవితాలు గడుపుతున్నాం. కొన్ని సార్లు తను అర్ధరాత్రి ఇంటికి వస్తాడు. కొన్ని సార్లు నేను తెల్లవారుజామునే వెళ్లిపోతాను. ఇద్దరం కలిసి బతకడానికి సమయం దొరకట్లేదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాం. మా ఇద్దరి కోసం ఓ షెడ్యూల్ పెట్టుకోవాలని అనుకుంటున్నాం.’ అని అన్నారు.