ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేడీ సూపర్‌స్టార్ తదుపరి సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ని వెల్లడించిన థమన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2023, 02:37 PM

జవాన్ యొక్క అద్భుతమైన విజయం తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతార తన 75వ చిత్రంతో మరోసారి వెండితెరను అలంకరించేందుకు సిద్ధంగా ఉంది. నీలేష్ కృష్ణ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'అన్నపూర్ణి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న ప్రేక్షకుల ముందుకి రానుంది.


ఇటీవలే సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రం యొక్క మ్యూజిక్ గురించి లేటెస్ట్ అప్డేట్ ని పంచుకున్నారు. రీరికార్డింగ్‌ని పూర్తి చేయడానికి తను మరియు తన బృందం మారథాన్‌లో మునిగిపోయామని మరియు అవుట్ ఫుట్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేసినట్లు అతను తెలియజేశాడు.


ఈ సినిమాలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, KS రవికుమార్, రెడిన్ కింగ్స్లీ, కుమారి సచ్చు, రేణుక, కార్తీక్ కుమార్ మరియు సురేష్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు నాద్ స్టూడియోస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa