టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తన ఇటీవలి చిత్రం టైగర్ నాగేశ్వరరావు నిరాశపరిచిన తర్వాత తన అభిమానులను మెప్పించేలా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. 'జాతి రత్నాలు' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ కెవి రవితేజకు కామెడీ స్క్రిప్ట్‌ను వినిపించినట్లు సమాచారం. కథ విన్న వెంటనే స్టార్ నటుడు వెంటనే స్క్రిప్ట్ కి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ పుకారు నిజమైతే, రవితేజ పూర్తి స్థాయి కామెడీ చిత్రంలో కనిపించి కొంతకాలం గడిచినందున ఇది అతని అభిమానులకు గుడ్ న్యూస్ అవుతుంది.
ప్రస్తుతం రవితేజ 'ఈగిల్' మరియు హరీష్ శంకర్‌తో ఒక రీమేక్ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. హరీష్ శంకర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే అనుదీప్‌తో సినిమాకి సంబంధించిన పనిని రవితేజ ప్రారంభించనున్నట్లు లేటెస్ట్ టాక్. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈగిల్ మూవీని విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.