బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. 47 ఏళ్ల వయసులో ఈ నటుడు పెళ్లి పీటలెక్కనున్నాడు. తన ప్రియురాలు లిన్ లైస్రామ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని రణ్‌దీప్ హుడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ నెల 29న రణ్‌దీప్, లిన్ లైస్రామ్ల వివాహం జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఇంఫాల్‌లో వివాహం జరగనుంది.