టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. ఇటలీలోని టస్కానీలో సన్నిహితలు మధ్య వివాహ వేడుక ఘనంగా జరిగింది. వరుణ్ తేజ్ తదుపరి చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' లో కనిపించనున్నాడు. ఈ ఏరియల్ థ్రిల్లర్ తో వరుణ్ తేజ్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో మానుషి చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో నటించాడు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు, మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించలేదు. తాజాగా ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ సినిమా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మూవీ టీమ్ నుండి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa