విధు వినోద్ చోప్రా రచన మరియు దర్శకత్వంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించిన '12th ఫెయిల్' సినిమా ఇటీవలే గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ బాలీవుడ్ బయోగ్రాఫికల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఆస్కార్ 2024కి ఇండిపెండెంట్ నామినేషన్‌గా సమర్పించబడింది. ఈ విషయాన్ని నటుడు విక్రాంత్ మాస్సే ఇటీవల మీడియాతో పంచుకున్నారు. మేధా శంకర్, ప్రియాంషు ఛటర్జీ, సంజయ్ బిష్ణోయ్ మరియు హరీష్ ఖన్నా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. విధు వినోద్ చోప్రా మరియు జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa