సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ మరియు రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలని పెంచింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 1, 2023న ప్రేక్షకులు ముందుకి రానుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ మరియు బబ్లూ పృథ్వీరాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
తాజాగా తెలుగు మీడియా ఇంటరాక్షన్లో, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అయ్యారు. యానిమల్ ప్రత్యేకంగా తెలుగు సినిమా అయితే, తను మహేష్ బాబుతో కలిసి పనిచేసేవాడినని ఆయన వెల్లడించారు. మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ను రిజెక్ట్ చేసారు అనే పుకార్లను తొలగిస్తూ యానిమల్ కంటే హింసాత్మకమైన డెవిల్ అనే విభిన్న కథని మహేష్ రిజెక్ట్ చేసినట్లు సందీప్ రెడ్డి వంగ స్పష్టం చేశాడు.